కాసేపు కాస్త నవ్వుకోండి సార్.. 😆😄😃😀
కాసేపు కాస్త నవ్వుకోండి సార్.. 😆😄😃😀 టీచర్ : సతీ సావిత్రి కధ లో నువ్వు తెలుసుకున్నది ఏమిటి? చెప్పరా. స్టూడెంట్ : భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!! 😀😝 సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి. డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా. 😁😁😁😁 బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా. చంటి : ఎందుకు? బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే. 😛😛😛😛 (అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో ) అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు వాళ్ళ నాన్నాతో. వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో............ .ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న 😄😄😄😄 ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు. సుబ్బారావు:ఎలా? ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. ...