*దత్తపది!*
ఒక అవధానిగారు అవధానం చేస్తుండగా తెలివైన పృఛ్ఛకుడు అడిగిన విషయమిది. *దత్తపది!* తమన్నా - సమంతా - త్రిష - కాజల్ _(ఈ పదాలన్నీ వచ్చేలా పద్యం చెప్పాలి)_ *అవధానిగారి పూరణ!* భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో... తేటగీతి: *తాతమన్నన* బొందిన ధన్యుడీవు *దోసమంతగ* నెంచడు - కాశి రాజ *పుత్రి షండునిగా* మారి పుట్టిముంచె గంగ రప్పించు *త్రాగుటకా జలమ్ము* 🙏🏼తెలుగు భాషాభిమానులందరికి🙏🏼