*దత్తపది!*

ఒక అవధానిగారు అవధానం చేస్తుండగా తెలివైన పృఛ్ఛకుడు అడిగిన విషయమిది.

*దత్తపది!*
తమన్నా - సమంతా - త్రిష - కాజల్
_(ఈ పదాలన్నీ వచ్చేలా పద్యం చెప్పాలి)_

*అవధానిగారి పూరణ!*
భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో...

తేటగీతి: 
*తాతమన్నన* బొందిన ధన్యుడీవు
*దోసమంతగ* నెంచడు - కాశి రాజ
*పుత్రి షండునిగా* మారి పుట్టిముంచె
గంగ రప్పించు *త్రాగుటకా జలమ్ము*

🙏🏼తెలుగు భాషాభిమానులందరికి🙏🏼

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం