*పుట్టింటికి వెళ్ళిన భార్య..!!*

*పుట్టింటికి వెళ్ళిన భార్య..!!*

_*తన భర్త కి పంపిన వాట్స్ అప్ మెసేజ్*_

1. పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరినుండి వచ్ చిందాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.
😜😜😜😜😜

2. 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నా తో పాటు హాండ్ బాగ్ లోఉంది.
😄😄😄😄😄

౩. మీరు చాలా హెల్దీ గా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు.
😁😁😁😁😁

4. మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లులు చాలా దొరికాయి.
😱😱😱😱😱

5. మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా నమ్మకం.
😡😡😡😡😡😡😡

6. పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి.
😏😏😏😏😏

7. అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?
😒😒😒😒😒

8. మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి. కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది.
😍😍😍😍😍

9. మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి.....!!!!!!! 
మన వీధిలో ఉండే మిసెస్ స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు.
😄😄😄😄

10. షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.
😜😜🤔🤔

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం