కుక్క తప్పిపొయింది

ఫోన్  గణ గణ  మోగింది !
.
జ్యోతి   పరుగు  పరుగున   ఫోన్  దగ్గరకి  వెళ్ళింది .  ఆమె  మనసు   చాలా  ఆందోళనగా  ఉంది .
.
.
.
"నమస్కారం  అండి"  అట్నుంచి   ఎవరిదో  గొంతు !
.
."నమస్కారం !  చెప్పండి "  జ్యోతి   బదులు  ఇచ్చింది .
.
." మీరు  కుక్క  తప్పిపొయింది   అని  పేపర్  లో  ప్రకటన ఇచ్చారు  కదా!" 
.
"అవునండీ !  మీకు  కనబడిందా !  ఎక్కడ  కనబడింది ?  మీరు  ఎవరు ?  ఎక్కడ  ఉంటారు ?   మీ దగ్గర  ఉందా ?  ఎలా  రావాలి ?  అది  లేక  ఇంట్లో  అందరం   అన్నపానాలు  లేకుండా   ఉన్నాము.  ప్లీజ్  ఎక్కడ  ఉన్నారో  చెప్పండి .  ఇప్పుడే  బయలుదేరి  వచ్చేస్తాం"  ఇంచు  మించు   ఏడుపు   గొంతుతో  ఆదుర్దాగా   అడిగింది  జ్యోతి 
.
.
.
.
.
.
" మేము వృద్ధాశ్రమం నుండి  మాట్లాడుతున్నామండి .  మీరిక్కడ మొన్న వదిలి  వెళ్ళిన మీ అత్త  మామలను  చూడడానికి మీ  కుక్క నిన్న  సాయంత్రం వచ్చి  ఇక్కడే  ఉండిపోయింది.

ఎవరో లాగి పెట్టి చెంపలు వాయించినట్టు అనిపిం......

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం