ఆత్మీయుల కోసం

*ఒక చక్కటి కధ* 
*ఎంతో అర్థం ఉన్న కధ*

సముద్రంలో పెద్ద తుఫాన్  !
ఓడ బద్దలయిపోయింది ...
ఇద్దరే ఇద్దరు  బ్రతికి ఒడ్డుకు చేరారు ...
అదొక దీవి ఎడారిలా ఉంది.  ఏమి చెయ్యాలో తోచ లేదు వారి ఇద్దరికీ.  

భగవంతుడిని  ప్రార్ధన చెయ్యడం తప్ప ఏమీ చెయ్యడానికి లేదు అనుకున్నారు ఇద్దరూ.అయితే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు.  ఎవరి ప్రార్ధనలు  ఫలిస్తాయో తెలుసుకోవాలంటే ఆ దీవిని రెండు భాగాలు చేసి ఒకరు ఒక వైపు రెండో వారు రెండో వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు.

మొదటివాడు రాము. రెండో వాడు సోము. ఆ రోజు రాము భగవంతుడా నాకు ఆహారాన్ని  ఇయ్యి అని వేడుకున్నాడు.  మర్నాడు ఉదయం అతడు చూస్తే అతడికి ఒక అరటిచెట్టు  మగ్గిన పళ్ళతో కనిపించింది.  పాపం సోముకి ఏమీ కనిపించలేదు ...ఇలా ఒక వారం  గడిచింది.

రాముకి ఒంటరితనం చికాకు అనిపించి నాకు ఒక భార్యను ఇవ్వు అని దేముడిని ప్రార్ధించాడు.  మర్నాడు ఒక ఓడ తమ ఓడలాగే బద్దలయ్యి ఒకే ఒక్క అమ్మాయి  ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది.  ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. 
పాపం సోము పరిస్థితి అలాగే ఉంది.

రామూ ఒక ఇల్లు, బట్టలు, ఇంకా ఆహారం  ఇమ్మని దేముడిని ప్రార్దిస్తూనే ఉన్నాడు.  దేముడు అడిగిన వన్నీ రామూకు సమకూరుస్తూనే ఉన్నాడు.
పాపం సోముకు ఏమీ లేదు

ఆఖరుగా రాము దేముడా నేనూ నా భార్య మా ఊరు వెళ్ళడానికి ఒక ఓడ  పంపించవా అని ప్రార్ధించాడు.  ఆశ్చర్యం ఓడ మర్నాడు వచ్చింది.  సోమూ ప్రార్ధన ఒక్కటీ దేముడు వినలేదు కనుక సోమూని తీసుకు వెళ్ళడం అనవసరం అనుకున్నాడు రాము.  అవును వాళ్ళిద్దరూ  బయలుదేరారు.  సామాను సర్దుకుని ఓడ ఎక్కుతున్నారు ...

ఆకాశం లోనుండి దేముడు అడిగాడు ...
సోమూని తీసుకు వెళ్ళవా? అతడిని అలాగే వదిలేస్తున్నావేమి?
రాము " నాకు నువ్వు ఇచ్చిన ఆశీస్సులు నావే కదా ! అతడి ప్రార్ధనలు నువ్వు వినలేదు కనుక అతడిని నేను తీసుకు వెళ్ళడం లేదు " అన్నాడు

" అక్కడే నువ్వు తప్పు చేశావు . అతడు ఒకే ఒక్క ప్రార్ధన చేశాడు . అతడి ప్రార్ధన వినే నేను నీకు ఇవన్నీ ఇచ్చాను. అతడు " నా స్నేహితుని ప్రార్ధనలు ఫలించాలి అలా చెయ్యి దేముడా ! " అని ప్రార్ధించాడు ... అందుకే నీకు ఇవన్నీ సమకూరాయి " అన్నాడు దేముడు.

మనకు లభించేవి అన్నీ మన ప్రార్ధనల వలన మాత్రమె మనకు లభించడం లేదు ... మన స్నేహితుల, సన్నిహితుల,  సహృదయుల ప్రార్ధనల, దీవెనల వలన మనం దేముని దయను పొందుతున్నాం ...
మన ఆత్మీయుల కోసం కూడా మనం ప్రార్ధిద్దాం ...
అందరూ బాగుండాలి అందులో మనముండాలి.

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes