అమ్మ

ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది.
అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నావంట కదా! ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను?

దానికి భగవంతుడు చిరునవ్వుతో నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది.
ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీ కోసం ఆడుతుంది.....పాడుతుంది..నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది.

నిన్ను ఎల్ల వేళలా ఆనందం ఉంచుతుంది.నన్ను గుర్తుకు రాకుండా చేస్తుంది.
అన్నీ వెరసి నీ ప్రతి ఒక్క విషయంలోనూ తను ఉంటుంది.మరి నాకు అక్కడ భాష రాదు కదా......మాటలు ఎలా అర్ధం చేసుకోను? నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు? అని అడిగింది పాప.

నువ్వు మాట్లాడలేకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు.
అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది. ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుకొంటుంది అన్నాడు భగవంతుడు.

మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను? నీ దేవత రెండు చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్దించాలో చెబుతుంది.
నీలో ఉండే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతుంది అన్నాడు.

ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది. భూలోకం నుంచి వేదనాద ధ్వనులు వినిపించాయి.అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ నా దేవత పేరేంటి అని అడిగింది.ఆ దేవత పేరు "అమ్మ "అని సమాధానమిచ్చాడు భగవంతుడు...

Comments

Popular posts from this blog

Pearls... Love Affordable Elegance...

jokes

తెలుగువాళ్ళ కారం